TABLE OF CONTENTS - YOU ARE WELCOME TO SEE ALL MY BLOG POSTS HERE

Custom Search

Tuesday, July 2, 2019

తమిళనాడుకమ్మవారిచరిత్ర (History of Tamilnadu Kammas)

తమిళనాడులో కమ్మవారు లేని ప్రాంతం లేదంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దక్షిణ భారతదేశంలోని విజయనగర రాజుల పాలనలో తెలుగువారు ఎక్కువగా తమిళప్రాంతాలకు తరలివచ్చారు.చాలావరకూ వీరంతా యుద్ధవీరులే. ముఖ్యంగా విజయనగర రాజ్యకాలంలోని కమ్మవారి ప్రఖ్యాత గండికోటయుద్ధం తరువాత, గండికోట పతనానంతరం, విజయనగర రాజుల రాజబంధువులైన కమ్మవారి యుద్ధ సైనిక బలగాల కుటుంబాలన్నీ తెలుగునేల నుండి వలసపోయి దక్షిణభారతదేశం, ముఖ్యంగా తమిళనాడు అంతటా విస్తరించారు.

తమిళనాడుకమ్మప్రముఖులు (రాజులు - సంస్థానాధీశులు - జమిందారులు)

మధురై పాలించిన నాయకరాజు తిరుమలనాయకుడు (Thirumalai Nayakar) కమ్మవారని ఆచార్య తిరుమల రామచంద్ర నిర్ధారించారు. మధురై ప్రాంత ప్రజలందరూ ఇప్పటికీ దీనిని విశ్వసిస్తారు. "తమిళనాడు కమ్మవారి చరిత్ర" లో ఇది స్పష్టంగా ఉంది. "తిరుమల నాయకర్ ప్యాలెస్" (Thirumalai Nayakar Palace) గొప్ప చారిత్రక భవనం.

తిరునల్వేలి జిల్లాలోని కురివికులం సంస్థానాధీశులు,  జమిందార్లు పెమ్మసాని వారు (Pemmasani Clan).

ఇలయరసనందలాల్ సంస్థానాధీశులు, జమిందార్లు రావెళ్ళ వారు.

మధురై జిల్లాలోని నాయకర్ పట్టి (Naickker Patti) సంస్థానాధీశులు, జమిందార్లు గుంటూరి వారు (Gunturi Clan).

రామనాధపురం జిల్లాలోని నన్నెమంగళం ప్రభువులు, సంస్థానాధీశులు,  జమిందార్లు గోళ్ళ వారు (Golla Clan).

సెవ్వల్ పట్టి (Sevval Patti) సంస్థానాధీశులు,  జమిందార్లు బెల్లం (Bellam Clan) వారు.

* గుడియాత్తం సంస్థానాధీశులు,  జమిందార్లు తుమ్మలవారు (Thummala Clan).

* చెంగల్పట్టు జిల్లా వరకాడు (Varakkadu) సంస్థానాధీశులు, జమిందార్లు గోవిందరాజులు నాయుడు.

కమ్మనాయకర్లు /కమ్మవారునాయుడు (Kamma Naickkers / Kammavar Naidu)...

తమిళనాడులో కమ్మవారిని నాయకర్లు, నాయక్కెర్లు (Naickker) అని పిలుస్తారు. కొంతమంది #వడుగర్లు (Vadugar) అని కూడా పిలుస్తారు. తమిళంలో "వడక్క" అంటే "ఉత్తర దిక్కు, ఉత్తరాది" నుంచి వచ్చిన వారు అని అర్ధం. తమిళంలో "వడుగు" అంటే "తెలుగు భాష", అరవం అంటే తమిళభాష. వడుగును మాట్లాడే కమ్మవారంతా వడుగర్లే. తమిళనాట వీరంతా కమ్మనాయుళ్ళు గా ప్రసిద్ధులు.

ఊరునాయకర్లు (గ్రామ పెద్దలు) గా కమ్మవారు....

తమిళనాడు రాష్ట్రం మెుత్తంమీద కమ్మవారి జనాభా 70 - 80 లక్షల పైమాటే. మధుర, రామనాధపురం, తిరునల్వేలి జిల్లాలలో కమ్మవారు షుమారు 400 గ్రామాలలో నివశిస్తున్నారు. కమ్మవారు అధికంగాఉండే గ్రామాలలో గ్రామపెద్దను "ఊర్ నాయకర్" అని పిలుస్తారు. నల్లరేగడి నేలతో ఎక్కువగా అనుబంధం కల కమ్మవారు ప్రత్తి, మిర్చి పండలను అధికంగా పండిస్తున్నారు. అగ్గిపెట్టెల తయారీ, ప్రత్తి, ఇటుకల వ్యాపారం, టెక్స్ టైల్స్ వ్యాపారంలో తమిళనాడు కమ్మవారు సుప్రసిద్ధులు.

తమిళనాడులో ఆధునిక వ్యవసాయ యంత్రసామాగ్రి వినియెాగానికి ఆద్యులు కమ్మవారే.....

కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, ధర్మపురి జిల్లాలలో దాదాపు 350 గ్రామాలలో కమ్మవారు నివసిస్తున్నారు. ఆధునిక యంత్రాలను వ్యవసాయంలో ప్రవేశపెట్టినది కోయంబత్తూరు వారు. తమిళనాడులో తొలిసారిగా కమ్మవారే బావులకు పంపుసెట్లు బిగించారు. డీజిల్ ట్రాక్టర్లు ఉపయెాగించారు. ప్రత్తి, చెరకు, పొగాకు, పండ్లతోటలను ఆరంభించింది మన కమ్మవారే. వ్యలసాయాధారిత పరిశ్రమలు, జిన్నింగుమిల్లులు, స్పిన్నింగు మిల్లులు, టెక్స్ టైలు మిల్లులు మనవారి కృషి కారణంగా అక్కడ అసంఖ్యాకంగా ఏర్పడ్డాయి.

మద్రాసు,చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాట్, దక్షిణ ఆర్కాట్ జిల్లాలలో రమారమి 500 గ్రామాలలో కమ్మవారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వీరు తమిళదేశంలో ఇతర ప్రాంతాల వీరివలే కాక, పూర్తిగా ఆంధ్రదేశంలోని సంప్రదాయాలనూ, ఆచారాలనూ పాటిస్తారు. తెలుగునాటి కమ్మవారికి లాగానే పేరు ముందు ఇంటిపేరు ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో తండ్రిపేరును ఇంటిపేరుగా వాడతారు. వీరందరినీ అగ్రకులకమ్మవారు గా గుర్తించడం వల్ల విద్యాఉద్యోగపరమైన రాయితీలు లేవు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి బొల్లినమునిస్వామినాయుడు బహద్దూర్, డాక్టర్ #గెంగుస్వామినాయుడు కృషి ఫలితంగా వీరి ఆర్ధికస్ధోమత, విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి.

తమిళనాడుకమ్మవారిప్రసిద్ధపరిశ్రమలు.....

పి.యస్.జి. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (పి.యస్.జి నాయుడు), యు.ఎస్.ఎస్. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (జి. డి. నాయుడు), శ్రీ వెంకటేశ్వర గ్రూప్ (వి. గెంగుస్వామినాయుడు), పాయనీర్ హేచరీస్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్, ఎల్ టెక్స్ గ్రూప్, ప్రికాల్ గ్రూప్ లాంటి తమిళనాడులోని ప్రసిధ్ధ వ్యాపార సంస్థలన్నీ మన కమ్మవారివే.

రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది కమ్మవారు రాణిస్తున్నారు. ఆర్కాట్ వీరాస్వామి, వైగో పులిపాటి (వాయుపురి గోపాలస్వామి నాయుడు) సుప్రసిద్ధులు.

సినిమారంగంలో భాగ్యరాజా, రాజశేఖర్ మెు||న వారు తమిళనాడు కమ్మవారే....

మూలం - ఆధారాగ్రంధాలు:

(1) కమ్మవారిచరిత్ర" గ్రంధం, శ్రీ కొత్త భావయ్య చౌదరిగారి రచన, "పావులూరి పబ్లిషర్స్" ప్రచురణ - - ఉండ్రాజవరం సంస్ధానాధీశులు ఆంధ్రభోజ, సాహితీవల్లభ, కళాప్రపూర్ణ "శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు" గారి "నరేంధ్రనాధసాహిత్యమండలి మరియు రాయల ప్రెస్" వారి సహాయ సహకారలతో ప్రచురణ, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా....

(2) కమ్మవారిసమగ్రచరిత్ర", కొత్త భావయ్య చౌదరి, "పావులూరి పబ్లిషర్స్", పావులూరి వెంకటనారాయణ, గుంటూరు...

(3) "HISTORY OF KAMMAS", Kotha Bhavaiah Chowdary, Pavuluri Publishers, Guntur (With the assistance of Andhra Bhoja Sri Mullapudi Thimma Raju, Samsthanadhisa of Undrajavaram and Zamindar of Tanuku) 

1 comment:

Venkateswarlu Chennuboina said...

మదురై నాయకులు కమ్మ అనటానికి ఆధారాలుఏవి లేవు,ఆధారాలు లేనప్పుడు తిరుమల రామచంద్ర గారు నిరూపించేది నిర్ధారించేది ఎమిటి? కథలు తప్ప.