TABLE OF CONTENTS - YOU ARE WELCOME TO SEE ALL MY BLOG POSTS HERE

Custom Search

Monday, August 22, 2011

WELCOME TO KYSS GRAND MEET ON AUGUST 28TH 2011

 http://mail.google.com/mail/?ui=2&ik=15c41fbb37&view=att&th=131f496eec915c9d&attid=0.1&disp=inline&zw
కమ్మ అనే పదంలోన  అమ్మ వుందిరా
కమ్మ అనే పదం భలే కమ్మగుందిరా
కులదైవం నందమూరి
కడదాకా మన ఊపిరి

 అంథకారం లో ఉన్న ఆంధ్రదేశానికి అశాదీపమైన వాడు
ఆత్మగౌరవ పతాకాన్ని అకాశ వీధుల్లో రెపరెపలాడించిన వాడు
గుడిసెల ముందు రాజకీయాల్ని గుట్టగా పోసిన వాడు
డిల్లీ నుంది గల్లీ దాక దుమ్ము లేపి దమ్ము చాటిన వాడు
వెన్ను చూపక వెల్లువై వచ్చి ఉర్రూతలూపిన వాడు
తెలుగు పదానికి తనే తాత్పర్యమైన వాడు
రాజకీయాలకు రంగు రుచి వాసన తెచ్చిన వాడు
అవినీతి పై అంతులేని యుద్దం చేసిన వాడు
గుండె గుండె లో గుడి కట్టుకున్నవాడు
మన రాముడు, కృష్ణుడు, దేవుడు మన తారకరాముని స్ఫూర్తి ఇదేనా..??


మంత్రానికి అర్థం చెప్పి మరీ మనువులు జరిపించిన కవిరాజు రామస్వామి చౌదరి..
న్యాయదేవతకు నుదుటి తిలకమై భాసిల్లిన  అవుల సాంబశివరావు, చల్లా కొండయ్య, జాస్తి అమరేశ్వరి..
స్వతంత్ర పోరాటం లో ముందు నిలిచిన గోగినేని భారతీదేవి,యార్లగడ్డ వెంకన్న,కాకాని వెంకతరత్నం, కల్లూరి చంద్రమౌళి..
ఆరు దశాబ్దాలపాటు అలుపెరుగక అన్నదాతల కోసం చట్టసభల్లో పోరాడిన ఆచార్య రంగా గారు..
గుండు కి ఎదురు నిలిచి గుండెధైర్యం చూపించిన ఉమేష్ చంద్ర..
అనితరసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసిన నాయుడమ్మ,కాకర్ల,గుళ్ళపల్లి.. 
 
చదరంగాన్నే రణరంగం చేసుకుని ప్రపంచాన్ని గెల్చిన హంపి, హరికృష్ణ..  
నాగార్జునసాగర్ నిర్మాణంలొ కీలక పాత్ర పోషించిన ముక్త్యాల వాసిరెడ్డి జమీందార్లు..
స్ఫూర్తిదాయకమైన రాజకీయాలకు చిరునామాగా నిలుస్తున్న మన చిన్నమ్మ (పురంధరేశ్వరి)...
క్రీడారంగంలొ మన సత్తా ప్రపంచానికి చాటిన పుల్లెల గోపీచంద్..
పలు సంస్థలను స్థాపించి దేశాబివృద్ధికి పాటుబడిన ముళ్ళపూడి, వెలగపూడి, రామోజి.. 

 ఎందరెందరో మహనీయులు.. ఎన్నో విజయగాథలు.. ఎక్కలేని ఎత్తుల్లేవు..దాటలేని దూరాలూ లేవు..   
 ఎల్లలు లేని ఖ్యాతి..  చెప్పుకుంటూ పోతే ఇదొక తుదిలేని కథ..

 ఇదంతా గతం..కానీ ప్రస్తుతం..
అంతు లేని యశస్సు ఒక వైపు  - చేయూత లేని మేథస్సు ఒక వైపు 
దిక్కు తోచని మన యువత   ఒక వైపు -  దారీతెన్ను తెలియని భవిత  మరొక వైపు
నిస్సత్తువ , నిర్వేదం , నిస్సహాయత , నిశ్శబ్దం , నిర్లిప్తత సుమారు దశాబ్ద కాలం నుండి మన జాతిని ఆవరించింది.    
ఇదేనా మన ఘన వారసత్వం...?ఇదేనా మన గత వైభవస్ఫూర్తి..?
ఎటు వైపు మన పయనం... హిమాలయాలంత ఎత్తుకా.. అథోపాతాళానికా...
దారి చూపే కాగడాలేవి..ముందు నిలిచే మార్గదర్శి ఏది ??
అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పే ప్రయత్నమే   కమ్మ యువ సేవ సమితి ఆవిర్భావం..

చీకటిలో దారి చూపి ముందుకు నడిపే అఖంఢ జ్యోతి..  
నెత్తురు మండే శక్తులు నిండిన యువకుల సమూహం..
నీతి కి నిలబడ్డ నేటి కమ్మ యువతకు ప్రతిబింబం.. 

విద్య,ఉద్యోగ,ఉపాధి అవకాశాల్లో సాటి కమ్మ యువతీ యువకులకు వెన్నుదన్నుగా మేమున్నాము అని చెప్పే ఒక చేయూత ...మార్గదర్శి..కాంతిరేఖ..ఒక నూతన ఒరవడి..

 ఉపకారవేతనాలు, రక్తదాన శిబిరాలు , సాంకేతిక శిక్షణ, ఆత్మీయ సమావేశాలు..ఇవీ కమ్మ యువ సేవ సమితి రూపొందించుకున్న కార్యక్రమాలు..  

తెలుగు వినువీధుల్లొ కమ్మ పతాకాన్ని సగౌరవంగా  ఎగరవేసి మన సత్తా చాటి చెప్పాలి

గత వైభవ దీప్తిని ఆరిపోనివ్వక.. అఖండజ్యోతిగా మలచి.. ఆ కాంతిలో ముందు తరాలకు బంగారుబాట వేయటానికి నిస్వార్థ నిర్మల సేవాపేక్షతో కమ్మయువసేవాసమితి  చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి తోడ్పాటు కావాలి..    


ఈ నెల 28 న కమ్మ యువ సేవా సమితి 7వ వార్షికోత్సవానికి మీ అందరు విచ్చేసి జయప్రదం చేస్తారని ఆశిస్తూ